సముద్రంలోకి శుక్రవారం ఉదయం నాలుగున్నర గంటల సమయంలో చేపల వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటు ఐఎన్డీ ఏపీబీ5 యం యం817 ప్రమాదవశాత్తు నీట మునగడంతో బోటులో వేట సాగిస్తున్న ఐదుగురు జాలర్లు మరో బోటు ఎక్కి సురక్షితంగా ఫిషింగ్ హార్బర్ కు చేరుకున్నారు..ఈ సందర్భంగా జాలర్లు శుక్రవారం రాష్ట్ర మరపడవల సంఘం కార్యాలయంలో మాట్లాడుతూ తాము చేపల వేట సాగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బోట్లోకి నీరు చేరడంతో ఈ సంఘటన జరిగిందని తెలియజేశారు బోటు ఓనర్ బాలకృష్ణ తమకు న్యాయం చేయాలని కోరారు.