సముద్రతీర ప్రాంతాల వద్ద భద్రత ఏర్పాట్లను సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల ఆదేశించారు మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా స్థాయి పోస్టల్ సెక్యూరిటీ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లేటప్పుడు తమ వెంట ఆధార్ కార్డు బయోమెట్రిక్ తీసుకొని వెళ్లేలా చర్యలు చేపట్టడంతో పాటు వారికి అవగాహన కల్పించాలని జిల్లా మత్స్యశాఖ అధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.