నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ లో నివాసం ఉంటున్న బాలస్వామి లక్ష్మీదేవి దంపతులు ఆగస్ట్ 30వ తేదీ హైదరాబాద్ కు వెళ్లారు ఆదివారం రాత్రి తిరిగి నంద్యాలకు చేరుకున్నారు అయితే ఇంటికి వచ్చి త్వరగా మెయిన్ గేట్ తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం ద్వారా విచారణ చేపట్టారు అయితే ఇంట్లో ఎటువంటి బంగారు కానీ నగదు కానీ పోక పోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. దొంగలు ఏమి ఎత్తుకెళ్లారని పోలీసులు ఆరా తీస్తున్నారు