ఆదోని శివారులోని రణమండల ఆంజనేయస్వామికి శ్రావణమాసం 45 రోజుల నిష్టతో భక్తులు ఇరుముడి కట్టి పూజలు నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి కాలినడకన బయలుదేరిన భక్తులు శనివారం స్వామివారికి ఇరుముడిని సమర్పించారు. కోర్కెలు తీర్చే దేవుడిగా ఆరాధిస్తూ ప్రతి సంవత్సరం ప్రత్యేక నైవేద్యాలు సమర్పించే భక్తులు స్వామి కరుణతో పీడల నుంచి రక్షణ లభిస్తుందని విశ్వసిస్తున్నారు.