ఎన్ఏడి జంక్షన్ సమీపంలోని కాకాని నగర్ రోడ్డులో ఆదివారం రాత్రి భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది భారత్ గ్యాస్ సిలిండర్లు పెడుతున్న వాహనాన్ని వెనకనుంచి ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా 108 కి ఫోన్ చేసినప్పటికీ ఎవరు స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వెంటనే వారిని బాధితులను రక్షించాలని కోరుతున్నారు. ప్రమాదం జరిగి అరగంట దాటినప్పటికీ ట్రాఫిక్ పోలీసులు ఎవరూ స్పందించలేదని స్థానికులు తెలిపారు. బాధితులు నొప్పితో విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.