ఆరవ వార్డు కొమ్మాది గ్రామంలో ప్రభుత్వ అసైన్డ్ భూమి సర్వే సంఖ్య 114లో భూ ఆక్రమణ దారులు కబ్జాకు తెరలేపారు. రోడ్డు ప్రక్కనే ఉన్న 200 గజాల స్థలానికి కంచె వేసేసారు. సమాచారం తెలుసుకున్న సచివాలయ సిబ్బంది ఆక్రమణ భూమిలో పనులు నిలిపివేయాలని సూచించారు. అడ్డగించిన సచివాలయం సిబ్బంది పై దౌర్జన్యానికి ఒడిగట్టారు. కోర్టు ఆర్డర్ ఉందంటూ తప్పుడు పత్రాలు చూపి ఆక్రమకు ప్రయత్నిస్తున్నారు. కోర్టు ఆదేశాలు చూపేవరకు కంచె నిర్మాణం ఆపాలని సచివాలయం సిబ్బంది తేల్చి చెప్పారు. చిత్రిస్తున్న మీడియాపై ఆక్రమనదారులు రుసరుస లాడారు.