భీమిలి సముద్ర తీరానికి వినాయకుని నిమజ్జనం చేసేందుకు చుట్టుపక్కల ప్రాంతాలు పక్క జిల్లాల నుండి అనేక వినాయక విగ్రహాలు శనివారం రాత్రి నుండి భారీగా తరలి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నార్త్ జోన్ ఏసిపి ఎస్.అప్పలరాజు పర్యవేక్షణలో సీఐ.బి. తిరుమలరావు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి భీమిలి సముద్ర వినాయక నిమజ్జన ప్రాంతాన్ని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్.శంకబ్రత బాగ్ఛీ సందర్శించారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఏర్పార్టులను అడిగి తెలుసుకున్నారు.