వినాయక చవితి సందర్భంగా పర్యావరణహిత మట్టి గణేష్ విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పిలుపునిచ్చారు.జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, రాయచోటి పురపాలక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాయచోటి మున్సిపల్ కార్యాలయం వద్ద మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మొత్తం 1500 మట్టి విగ్రహాలను ప్రజలకు అందించారు.మట్టి విగ్రహాల ద్వారానే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వలన నీటి కాలుష్యం, భూమి సారవంతం తగ్గిపోతుందని ఆయన హెచ్చరించారు.