మంత్రాలయం : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న నరసింహ రాజుకు శుక్రవారం ఉత్తమ ఉపాధ్యాయుడిగా కలెక్టర్ రంజిత్ బాషా, ఎంపీ నాగరాజు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. పాఠశాల విద్యార్థులకు క్రీడలలో ఉన్న ప్రాముఖ్యతను వివరిస్తూ వారికి మెళకువలు నేర్పించారు. విద్యార్థులకు జాతీయ రాష్ట్ర స్థాయిలలో ఆడేందుకు తోడ్పడ్డారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని అవార్డు అందుకున్నారు.