గట్టు మండలం ఆరగిద్ద జ్ఞాన సరస్వతి ప్రైవేట్ స్కూల్ వ్యాన్ శుక్రవారం ఉదయం గట్టు సల్కాపురం గ్రామాల మధ్య పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వ్యానులో 20 మంది విద్యార్థులు ఉండగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్కూల్ వ్యాన్ వరి పొలంలో కూరుకుపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని విద్యార్థులు అంటున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.