భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం గ్రామంలోని ఎస్టీ బాలుర హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న రాజేంద్ర అనే విద్యార్థి శనివారం ఉదయం 8 ప్రాంతంలో హాస్టల్ ముందు ఉన్న చెట్టును కోడుతున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురై కిందపడ్డాడు,వెంటనే ఉపాధ్యాయులు జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నరు.అయితే విద్యార్థి చెట్టు కొట్టడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విద్యార్థి తల్లిదండ్రులు.