గురువారం సాయంత్రం జిల్లాలోని పశ్చిమ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠీ వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠీ కార్యాలయ రికార్డులు, కేసు డైరీలు, క్రైమ్ రిజిస్టర్, పెండింగ్ కేసుల ఫైల్ లను పరిశీలించారు. అదేవిధంగా పరిపాలన సిబ్బంది హాజరు రిజిస్టర్, విధి నియామక పట్టికలు, డ్యూటీ రోస్టర్ల ను తనిఖీ చేశారు. ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ నేర నిరోధక చర్యలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.