గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏటూరునాగారంలోని ఇండియన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతికి మహాలక్ష్మీ అవతారంలో అలంకరించారు. బుధవారం సాయంత్రం రూ.21 లక్షల కరెన్సీనోట్లను దండలుగా గుచ్చి ప్రత్యేక పూజలను నిర్వహించారు. గణేషుడికి కరెన్సీ నోట్ల అలంకరణ చేయగా, భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్లి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.