దేవనకొండ మండలంలో సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న సాగునీటి సమస్యల పరిష్కారానికి చొరవ చుపాలని కోరుతూ.. సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో మండలానికి విచ్చేసిన కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తీపాటి నాగరాజు కు సాగునీటి సమస్య పరిష్కరించాలని వినతి పత్రం అందజేసిన దేవనకొండ మండలం అధ్యక్షుడు వీర శేఖర్ తెలిపారు. హంద్రీనీవా కాలువ నుండి మండలానికి 46 వేల ఎకరానికి చెప్తున్నా అధికారికంగా 10 వేలకు మించడం లేదన్నారు. తమరు చొరవ చూపించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.