SRపురం మండలంలో మహిళను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భాస్కర్‌ను అరెస్ట్ చేసినట్లు DSP సయ్యద్ మహమ్మద్ అజీజ్ వెల్లడించారు. గురువారం DSP తెలిపిన వివరాల మేరకు.. యాదమరి మండలం వరదరాజులపల్లికి చెందిన వ్యక్తితో పూజకు వివాహమైంది. అతను మూడేళ్ల కిందట చనిపోయాడు. అనంతరం భాస్కర్, పూజకు వివాహేతర సంబంధం ఏర్పడింది.