కర్నూలు జిల్లాలో ఈనెల 16న ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సమీక్షించారు. బుధవారం ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్గేట్ వద్ద రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు పరిశీలించి అధికారులకు మార్గనిర్దేశం చేశారు. 11 ప్రదేశాల్లో పార్కింగ్, బహిరంగసభ ప్రదేశంలో విఐపిలకు 10 పడకల హాస్పిటల్, ప్రజలకు 20 పడకల హాస్పిటల్, సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.