కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలోని అంబేద్కర్ కూడలి వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు పథకాన్ని మహిళలు వినియోగించుకుంటున్నారు. సోమవారం తెల్సిన వివరాలమేరకు కానీ విద్యార్థులు మాత్రం స్కూల్, కాలేజీలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బస్సులు సమయానీకి ఉండకపోవడంతో స్కూల్లో,కాలేజీల వద్ద ఉపాధ్యాయులతో విద్యార్థులు తమ గోడు వినిపించుకుంటున్నారు.విద్యార్థులు పడుతున్న కష్టాల పైన విద్యార్థి సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. కమలాపురం నియోజకవర్గం ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి షేక్ సాదిక్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయాలన్నారు.