నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ ముందు యూరియా కావాలంటూ రైతులు ధర్నా నిర్వహించిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు యూరియా కోసం సింగిల్ విండో గోదాం వద్దకు రాగా తక్కువ మొత్తంలో పంపిణీ చేయడంతో రైతులు ఆగ్రహంతో ప్రధాన రహదారి పైకి వచ్చి ధర్నా నిర్వహించారు.