మోపిదేవిలో యూరియా కోసం రైతుల అవస్థలు స్తానిక మోపిదేవి మండలంలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. బుధవారం మద్యాహ్నం 3 గంటల సమయంలో పీఏసీఎస్ కు యూరియా వచ్చిందని తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగినన్ని యూరియా బస్తాలు అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.