చిత్తూరు: మీసేవ కేంద్రాలు ప్రారంభించిన జడ్జి చిత్తూరు జిల్లా న్యాయస్థానాల సముదాయంలో కక్షిదారుల సౌలభ్యం కోసం మీ సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో రెండు మీసేవ కేంద్రాలను ఆమె ప్రారంభించారు. న్యాయస్థానాల్లో కేసుల విచారణకు సంబంధించి వివరాలన్నీ కూడా ఇక్కడున్న కంప్యూటర్లో పొందుపరిచామన్నారు. కక్షిదారులు వారి కేసుల వివరాలను తెలుసుకోవచ్చన్నారు.