గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని భీమడోలు సీఐ యూజే విల్సన్ పిలుపునిచ్చారు. భీమడోలు సర్కిల్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీలతో సీఐ విల్సన్, ఎస్ఐ సుధాకర్, విద్యుత్, రెవెన్యూ, ఫైర్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈమేరకు గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎటువంటి విభేదాలు లేకుండా శాంతియుతంగా, సంతోషంగా నిర్వహించుకోవాలన్నారు. వినాయక చవితి పండుగ మొదలుకుని, విగ్రహాల నిమజ్జనం వరకు చాలా క్రమబద్ధంగా జరిగేలా ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలన్నారు.