నారాయణపేట జిల్లా మరికల్ మండల పరిధిలోని తీలేరు గ్రామ వ్యవసాయ సహకార సంఘం భవనం ను శనివారం మూడు గంటల సమయంలో నారాయణపేట ఎస్పి యోగేష్ గౌతమ్ సందర్శించారు. శనివారం ఉదయం నుండి రైతులు యూరియా కోసం లైన్లో వేచి ఉంటూ యూరియా దొరకదనే నెపంతో గుంపులుగా ఒకేసారి రైతులు రావడం వల్ల రైతులు వరుస క్రమంలో ఉండే యూరియా తీసుకోవాలని వారిని కంట్రోల్ చేయడంలో మరికల్ ఎస్ఐ రాము ఒక రైతు పై చేయి చేసుకోవడం వలన ఎస్పీ మరికల్ ఎస్సై రాము పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద ముందస్తు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారిచేశారు.