నార్సింగి మండల వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు కుంటలు నిండడంతో పంటలు కూడా నీట మునిగిపోయాయి. మునిగిపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి హరి ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటితో నిండిపోయిన పంట పొలాలను పరిశీలించిగా ఇప్పటి వరకు మండల పరిధిలో ప్రాథమికంగా వరి 253 మంది రైతులకు సంబంధించి 280 ఎకరాలలో దెబ్బతినట్లు ప్రాథమికంగా అంచనా వెయ్యటం జరిగిందన్నారు. పంటలకు సంబంధించి నివేదికలు తయారు చేసినట్లు తెలిపారు. నివేదికను ఉన్నత అధికారులకు పంపిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ లు దివ్య,విజృంభణ రైతులు పాల్గొన్నారు