ఏలూరు జిల్లా సిపిఎం కార్యదర్శి రవి కోట్లలో అవినీతికి పాల్పడ్డారని ఆ పార్టీ నేత సోమయ్య ఆరోపించారు.. ఏలూరు సిపిఐ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం జిలుగుమిల్లి బుట్టాయిగూడెం మండలాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను మోసం చేసి మూడు కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.. తన భార్య మహిళా మండల సంఘ నాయకురాలుగా చలామణి అవుతూ ఆరు లక్షల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.. సిపిఎం పార్టీలో అవినీతి పెరిగిపోయిందని సాక్షాత్తు ఆ పార్టీ మహాసభలోనే పెద్దలు చెప్పారని అన్నారు..