అప్పుల బాధ తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా బిక్కనూర్లో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండి రాజు(35) గత కొంత కాలం కింద హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. అప్పుల బాధ తాళలేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరూ పిల్లలు ఉన్నారు