చిప్పగిరి శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం RSS, పోలీస్ శాఖ, చిప్పగిరి మండల యువత కలిసి శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఐ శ్రీనివాసులు ప్రధానంగా శుభ్రత పనుల్లో పాల్గొని యువతను ప్రోత్సహించారు. దేవాలయం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యతని గుర్తుచేశారు. ఇక నుంచి దేవాలయ పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేదని అన్నారు. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.