జీవీఎంసీ 3 వ వార్డులో రూ. 2.59 కోట్ల వ్యయంతో నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, ఫిష్ అండ్ వెజిటబుల్ మార్కెట్ ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మేయర్ పీలా శ్రీనివాసరావు గురువారం ప్రారంభించారు. ఫిష్ అండ్ వెజిటబుల్ మార్కెట్ లో 28 స్టాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ లో 11 షాపులు నిర్మించారు. మార్కెట్ లోపల స్టాల్స్, షాపుల్లో సౌకర్యాలు ఎమ్మెల్యే, మేయర్ పరిశీలించారు. అనంతరం కోతకు గురవుతున్న భీమిలి బీచ్ ప్రాంతాన్ని.. శిధిలావస్థలో ఉన్న మున్సిపల్ చౌల్ట్రిని కూడా సందర్శించారు కార్యక్రమంలో భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురుమిన రామస్వామి నాయుడు పాల్గొన్నారు.