పెడనలో బాలగణపతి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఐదో వార్షికోత్సవ వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది. ఊరేగింపులో సంప్రదాయబద్ధంగా మేళతాళాలు, కర్రసాము, కోలాట భజనలతో కళకళలాడింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొని గణనాథుడి నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. గత ఐదేళ్లుగా ఈ ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు.