శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం కొండ్రవారిపల్లి లో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన రంగస్వామి నాయుడు, కిష్టప్ప అనే వ్యక్తులు తెలంగాణ రాజధాని హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కొండ్రవారి పల్లికి చెందిన రంగస్వామి నాయుడు ఆయన భార్య ఆదిలక్ష్మి కిష్టప్ప హైదరాబాదులో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. గత నెల 29వ తేదీన రంగస్వామి నాయుడు కుమారుడు వివాహము ఉండడంతో స్వగ్రామానికి వచ్చి శుక్రవారం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. బస్సు దిగి వారు ఉంటున్న నివాస ప్రాంతానికి వెళ్లేందుకు రోడ్డుపై నిల్చుని ఉండగా వేగంగా వచ్చిన కారు ఢీ