నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సిద్ధ పద్మ కేక్ కట్ చేశారు. శుక్రవారం మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఒకరోజు ముందుగానే టీచర్స్ డే నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హేమలత, సంతోష్, శ్రీనివాస్, మోరే శ్రీనివాస్, మసియొద్దీన్, సురేందర్, విద్య రాణి, సునీత, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు.