జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింత సురేష్ బాబు శుక్రవారం విశాఖపట్నంలో జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ భేటీ విశాఖ బీచ్ రోడ్‌లోని బై వ్యూ హోటల్‌లో జరిగింది.కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో జరుగుతున్న జనసేన బలోపేతం, స్థానిక రాజకీయ పరిణామాలపై సురేష్ బాబు పవన్ కళ్యాణ్‌కు పూర్తి వివరాలు అందించారు. పార్టీ బలపాటుకు అవసరమైన వ్యూహాలు, కాడర్ అభిప్రాయాలు, గ్రామస్థాయి శక్తివంతమైన వర్గీకరణపై చర్చించారు.పార్టీ తాలూకు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై కూడా ఇద్దరు నాయకులు మంతనాలు జరిపినట్లు సమాచారం. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, గ్