తొమ్మిది రోజులపాటు వాడవాడలా ఆధ్యాత్మిక సందడి చేసిన మహాగణపతి భక్తకోటి నుంచి సెలవు తీసుకున్నారు.. గణపతి పప్పా మోరియా మంగళ మూర్తి మోరియా గణేష్ మహారాజ్ కి జై అంటూ భక్తులు విన్నంటే నినాదాలు నగరమంతా మారుమోగాయి.. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో భారీ గణపయ్యలను ఉంచి మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య యువత కేరింతలు మహిళల కోలాటాలతో ఖమ్మం మున్నేరులో నిమర్జనం అంతా కన్నుల పండగ సాగింది.