ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని చిల్డ్రన్ పార్క్ మందుబాబులకు అడ్డాగా మారింది. మద్యం సేవించి మందు బాబులు మద్యం సీసాలు పగలగొట్టి గాజు ముక్కలు వేస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు సిఐటియు నాయకులు ఆవులయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పిల్లల కోసం ఏర్పాటుచేసిన చిల్డ్రన్ పార్కును పట్టించుకోకపోవడంపై వారు అసహనం వ్యక్తం చేశారు పిచ్చి మొక్కలు పెరిగిపోయి పార్కు పనికిరాకుండా పోయిందని వెంటనే అధికారులు స్పందించి చిల్డ్రన్ పార్కు మరమ్మతులు చేసి వినియోగంలో తీసుకురావాలని డిమాండ్ చేశారు.