జిల్లా కలెక్టర్ బొప్పాయి పంటపై మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో సుమారు 4000 మంది రైతులు 11 వేల ఎకరాలలో బొప్పాయి పంట పండిస్తారని రాజంపేట రైల్వే కోడూరు లలో సాగు ఎక్కువగా ఉంటుందని మిగిలిన ప్రాంతాలలో కొద్దిగా తక్కువగా ఉంటుందన్నారు. జూన్ మరియు జూలై మాసాలలో మొదటి కోత అనంతరం కిలోకు 16 రూపాయల ధరతో రైతుల దగ్గర కొనేవారని, అనంతరం ఉత్తర భారత దేశంలో నెలకొన్న పరిస్థితుల వల్ల బొప్పాయి ధర తగ్గిందని దీన్ని కట్టడి చేయడానికి గతంలో ట్రేడర్లు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా చైర్మన్ రూపనంద రెడ్డి మరియు రైతు సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతులకు తొమ్మిది రూపాయలతో ధర నిర్ణయించామన్నారు.