కాగజ్నగర్ వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. గత నెల పదవ తేదీన యూరియా కోసం ఇచ్చిన టోకెన్లు 20 రోజులు గడిచిన రైతులకు యూరియా అందించకపోవడంతో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం నుండి వర్షం లో తడుస్తూ కార్యాలయం వద్ద నిలబడి అధికారులు స్పందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. యూరియాను రైతులకు పంపిణీ చేయకుండా యూరియాను పక్కదారి పట్టించి బయట అధిక ధరలకు అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియాను పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు,