కర్నూలు జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో కల్లూరు అర్బన్ సుందరయ్య సర్కిల్ వద్ద CITU నిరసన కార్యక్రమం జరిగింది. ఖబర్దార్ జయరాం అంటూ కార్మికులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధిగా తగిన నడవడిక పాటించకపోతే తీవ్ర నిరసనలు ఎదురవుతాయని హెచ్చరించారు.