లిక్కర్ స్కాంపై దర్యాప్తులో భాగంగా పుత్తూరులో వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నివాసంలో సిట్ సుదీర్ఘ విచారణ ముగిసింది. ఇవాళ ఉదయం 10 గంటలు నుంచి సాయంత్రం ఐదు గంటలు వరకు ఆయన్ను సిట్ ప్రశ్నించింది. ఎక్సైజ్ శాఖలో తీసుకున్న కీలక నిర్ణయాలు, స్కాంకు సంబంధిత అంశాలపై స్టేట్మెంట్ నమోదు చేసింది. విచారణ అనంతరం నారాయణ స్వామి మాట్లాడుతూ.. తనపై కొన్ని ఛానళ్లు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని, సిట్‌కు పూర్తిగా సహకరించినట్లు స్పష్టం చేశారు.