చొప్పదండి ఫైర్ స్టేషన్ లో ఫైర్ మెన్ గా పనిచేస్తున్న మనోహర్ పై అధికారుల వేధింపులు భరించలేక ఈనెల 2వ తేదీ మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చొప్పదండి ఫైర్ అధికారులు తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ కించపరుస్తున్నారని మనస్తాపంతో పురుగు మందు తాగాడు. అతని స్నేహితులు వెంటనే కరీంనగర్ లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు నగరం లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫైర్ మెన్ మనోహర్ మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తము మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో భద్రపరిచారు.