ఆపదలో ఉన్నవారికి అండగా తెలుగుదేశంపార్టీ ఉంటుందనడానికి నేపాల్ ఉందంతమే నిదర్శనమని ఏపీ అప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. గురువారం భీమడోలు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గన్ని మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ కృషితో నేపాల్ నుంచి స్వస్థలాలకు తెలుగు ప్రజలను చేరవేర్చడం చాలా ఆనందంగా ఉందన్నారు.