హైదర్ నగర్ డివిజన్ డివిజన్ పరిధిలోని జలవాయు విహార కాలనీ ఆదిత్య నగర్ కాలనీలలో కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు శుక్రవారం మధ్యాహ్నం అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలో నెలకొన్న సమస్యలు చేపట్టవలసిన అభివృద్ధి పనులను పరిశీలించి త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు పలు సమస్యల గురించి తెలుపగా వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.