కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గండికోటలో శనివారం జరుగుతున్న సాస్కీ పనులను గ్రామ ప్రజలు అడ్డుకున్నారు.గండికోట గ్రామంలో సాస్కి ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను తమ గ్రామ సమస్యలను పరిష్కరించిన తర్వాత చేపట్టాలంటూ గ్రామ ప్రజలు నిరసన తెలిపారు. గతంలో తమ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లిన పరిష్కరించలేదన్నారు. విషయం తెల్సిన వెంటనే జమ్మలమడుగు ఎస్ఐ రామకృష్ణ, పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పనులను అడ్డుకోవడం తగదని తెలిపారు.