రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని రాయదుర్గం ఎస్ఐ ప్రసాద్ సూచించారు. రాయదుర్గం పట్టణంలోని అనంతపురం రోడ్డులో శుక్రవారం సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని పలు వాహనాలకు జరిమానాలు విధించారు. వాహన రికార్డులు లేకపోవడమే కాక నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్ లను ఆపి రెండువేలు చొప్పున జరిమానాలు విధించారు.