నంద్యాల జిల్లా బేతంచర్లలో మిలాద్ నబి వేడుకల సందర్భంగా విద్యార్థులకు ప్రవక్త మహమ్మద్పై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. మంగళవారం ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల కాజీ నూర్ అహ్మద్, కమిటీ సభ్యులు ప్రతిభకనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.