దేవనకొండలో దాదాపు 100 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తిశ్రద్ధలతో గణపయ్యకు మహిళలు నైవేద్యాలు సమర్పించి, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం పాత జిన్ను కాలనీలో రాయల్ యూత్ ఏర్పాటుచేసిన వినాయకున్ని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహకకార్య దర్శి వైకుంఠం శివప్రసాద్ సతీమణి వైకుంఠం జ్యోతి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యూత్ సభ్యులు ఆమెను శాలువాతో ఘనంగా సత్కరించారు.