చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలల కిడ్నాప్ గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వివరాలు తెలుపుతూ ఐదేళ్లుగా సైబరాబాద్ సంగారెడ్డి పరిధిలో చిన్నారులను కిడ్నాప్ చేశారని తెలిపారు. ఆగస్టు 26న లింగంపల్లిలోని పోచమ్మ గుడి సమీపంలో అఖిల్ అనే బాలుడు మిస్ అవ్వడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా కిడ్నాప్ గ్యాంగ్ గురించి తెలిసిందని అన్నారు. కిడ్నాప్ గ్యాంగ్ లో రాజు ఆసిఫ్ రిజ్వానా నరసింహ బాలరాజ్ అనే వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.