మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బోనాల ఉత్సవాలను సామరస్యంగా శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్సై గోవిందరెడ్డి శుక్రవారం సూచించారు. శుక్రవారం పోలీస్స్టేషన్లో ఆలయ కమిటీలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. శాంతి భద్రతలకు విగాథం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పలహారం బండి తొట్టెల ఊరేగింపు వివరాలను ముందుగానే పోలీసులకు తెలియజేయాలన్నారు ప్రజల భద్రతకు భంగం కలగకుండా కట్టుదిట్టమైన భద్రత బందోబస్తును ఏర్పాటు చేస్తామని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.