నగరి మున్సిపాలిటీ పరిధిలోని కె.వి.ఆర్ పేటలో జాతర మహోత్సవంలో మంగళవారం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికి సన్మానించారు. ప్రజలకు ఎమ్మెల్యే గంగ జాతర శుభాకాంక్షలు తెలిపారు. కాగా రాత్రి పట్టణంలోని గంగమ్మ గుడి వద్ద అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.