జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులఫై రాయదుర్గం ఎంపిడిఓ కార్యాలయంలో ఉన్నతాధికారులు సామాజిక తనిఖీ బహిరంగ విచారణ చేపట్టారు. శుక్రవారం ఉదయం నుండి జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిడబ్యుఎంఏ ప్రిసీడిఓగ్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి, జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ శ్రీనివాసులు, ఏపిడి రాజారావు ఎంపిడిఓ కొండన్న, ఏపిఓ రవి తదితరులు పాల్గొన్నారు. రాయదుర్గం మండలంలో 2024-25 ఏడాది జరిగిన రూ. 14. 4 కోట్లకు సంబంధించిన పనులపై ఆడిట్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.