బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టనున్న సిసి రోడ్డు, డ్రైనేజీ పనులకు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు భూమి పూజ చేశారు. గ్రామాల్లో సమస్యలు లేకుండా చేయాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం పనుల జాతరను ప్రారంభించిందని ఆయన వెల్లడించారు.