మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రారంభించారు. నేరానికి సంబంధించి సంఘటన స్థలంలో సాక్షాదారులను సేకరించి నిందితులను గుర్తించడంలో ఫోరెన్సీ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సీ విభాగం కామారెడ్డి జిల్లాకు నూతనంగా మొబైల్ ఫోరెన్సీ వాహనాన్ని అందజేశారని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానన్ని వినియోగించుకొని అత్యాధునిక పరికరాలతో రూపొందించబడిన ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని పోలీసులుకు మరింత మెరుగైన సేవలందించనున్నదని తెలిపారు. ఏదైనా నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్,ఫింగర్ ప్రింట్,అధికారులు చేరుకుంటారన్నారు